![]() |
![]() |

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ మొత్తం చిరుకి డేడికేట్ చేశారు. చిరంజీవి బర్త్ డే ఆగష్టు 22 న రాబోతున్న సందర్భంగా 20 వ తేదీన ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ లో అన్ని చిరంజీవి మూవీస్ నుంచే డాన్సస్ , స్కిట్స్ చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ప్రతీ షోలో ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తూ హైలైట్ అవుతున్నారు కొంతమంది. కానీ ఇంత వరకు ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ప్రశాంతంగా సాగిపోతున్న షో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఐతే నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో మాత్రం ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ ఇద్దరు బుల్లితెర నటులు ఫైట్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది. అంబటి అర్జున్ వెర్సెస్ మానస్ మధ్య స్టేజి మీద పెద్ద గొడవే జరిగింది.
అందరి ఫోన్స్ ని ఒక దగ్గర పెట్టి రాండమ్ గా ఒక ఫోన్ తీసి అందులో ఉన్నవేంటో చూసే కాన్సెప్ట్ ని పెట్టారు ఆది, రష్మీ. ఇందులో రష్మీ అర్జున్ ఫోన్ తీసేసరికి అందులో ఎం కనిపించాయో కానీ ఆది మాత్రం నోరు మూసేసుకున్నాడు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కి మానస్ మధ్యలో వచ్చి "ఆయన ఫోన్ ఓపెన్ చెయ్యి చాలా చాలా విషయాలు దొరుకుతాయి" అనేసరికి " పెళ్ళైన వాడిని నా ఫోన్ చూస్తే ఏముంటాయి...నీ ఫోన్ లోనే ఉంటాయి" అనేసరికి "అనవసరంగా ఎందుకు నన్ను కెలుకుతావు" అని మానస్ అనేసరికి "పేమెంట్ ఇచ్చేది పంచులు వేయడానికే తీసుకో" అన్నాడు అర్జున్. "అంటే ఏది బడితే అది అనేస్తావా" అని ఫైర్ అయ్యాడు. "నేను ఇక్కడ పంచ్ వేశానని ఫీల్ అవుతున్నావు నువ్వు బయట ఎన్నో షోస్ లో పంచెస్ వేయలేదు... నేనేమన్నా ఫీల్ అయ్యానా" అని అర్జున్ అనేసరికి " నేను ఎప్పుడు వేసానో చెప్పు అన్నాడు ... ఇలా ఐతే అసలు మానస్ ని షోకి రావొద్దని చెప్పు" అంటూ అర్జున్ ఫైర్ అయ్యాడు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు చేతులెత్తుకుని కొట్టుకునే వరకు వెళ్ళింది పరిస్థితి. ఈ ఇద్దరినీ స్టేజి మీద ఉన్న వారంతా కలిసి ఆపి పక్కకు తీసుకెళ్లారు. ఐతే ఇది ప్రాంకా లేదంటే నిజంగా ఇద్దరూ కొట్టుకున్నారా తెలియాలంటే నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాలి.
![]() |
![]() |